చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ *కథానాయకుడు – మహనాయకుడు*

IMG-20190112-WA0002

చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ
*కథానాయకుడు – మహనాయకుడు*

నాకప్పుడు పదేళ్లు. శ్రీ ఎన్ టీ రామారావు గారు స్వర్గస్థులయ్యారని న్యూస్. ఈనాడు పేపర్ ఫస్ట్ పేజీలో ఆయన నివువెత్తు ఫోటో, హెడ్లైన్ లో ఆ వార్త. దాని ఇంటెన్సిటీ ఆ వయసులో నాకు అర్థంకాలేదు.
నాన్న ఆ పేపర్ కటింగ్ ని ఒక పెద్ద cardboard కి అతికించి చాలా రోజులు దాచారు. తరవాత కాలగర్భంలో పడి కలిసిపోయింది. మెల్లగా రొటీన్లో పడి అందరూ మర్చిపోయం.

కానీ ఇప్పుడు 24 సంవత్సరాల తరవాత ఎన్టీఆర్ కథానాయకుడు చూస్తుండగా ఆ పేపర్ కటింగ్ నా జ్ఞాపకాల పొరల్లోంచి బయటకు వొచ్చి నిలపడింది.
ఆ వార్త నా కళ్ళ ముందుకొచ్చి ఆగినట్టుగా అయ్యింది. అసంకల్పితంగానే నేను ఆ హెడ్లైన్ చదువుతున్నా ,
“అన్న గుండె ఆగింది,
పేదవాడి అన్నం గిన్నె తొణికింది!!!”
ఒక్కసారిగా నాకు ఒళ్ళు గగుల్పొడిచినట్టు అనిపించింది.

ఎం సినిమా తీసావయ్య క్రిష్
వెన్నులో వొణుకు పుట్టించావు. యుగపురుషుడుని ఈ తరానికి చూపించావు. Hatsoff

బాలకృష్ణ చాలా అద్భుతంగా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. సెకండ్ హాఫ్ అయితే ఎన్టీ రామారావే వచ్చి నటించారా అన్నట్టుగా అనిపించింది.

ఒక రైతు బిడ్డ
విలువలతో బతికే వ్యక్తి
అందం అభినయం కలబోసిన కథానాయకుడు
కష్టం తెలిసిన మనిషి
ఎదుటివాడి బాధ తనది అని భావించి సాయపడే మహనీయుడు.

రాయలసీమకు కరువొచ్చినప్పుడు
దివి సీమకి ఉప్పెనొచిన్నప్పుడు
అండగా నిలబడ్డాడు.

వెండి తెరపై రాముడు , కృష్ణుడు!!! ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న *మహానటుడు.*
ప్రజల కోసం పాటుపడి వారి గుండెల్లో నిలిచిపోయిన నిజమైన దేవుడు…

ఎన్టీఆర్ ప్రజల కోసం, ప్రజల కష్టాల్లోంచి పుట్టిన మహనాయకుడు.

తెలుగు వాడి ఉనికిని ప్రపంచానికి చాటిచెప్పిన మహానుభావుడు.

అతని గురించి నాలుగు లైన్లు రాస్తుంటేనే ఎదో భావోద్వేగానికి లోనైనట్టుగా అనిపిస్తోంది.
అలాంటిది ఆ మహా మనీషి జీవిత చరిత్ర తెరపైకి ఎక్కించే ప్రయత్నంలో భాగం అయిన ప్రతి ఒక్కరి మానసిక స్థితి అంచనాలకు కూడా అందడంలేదు నాకు.

Yes, బయోపిక్ అంటే ఇది.
బయోపిక్ అంటేనే ఇది.
ఊహు!!!బయోపిక్ అంటే ఇదే!!!

Any doubts???

Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *